అరుణ్ జైట్లీ గారి మరణం బాధాకరం: పవన్ కల్యాణ్

0
2
అరుణ్ జైట్లీ గారి మరణం బాధాకరం: పవన్ కల్యాణ్

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అస్తమయం
  • వీడియోలో స్పందించిన జనసేనాని
  • జైట్లీ జీవితం స్ఫూర్తిదాయకం అంటూ వ్యాఖ్యలు

                           వివరాల్లోకి వెళితే…కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ రోజు అరుణ్ జైట్లీ గారు పరమపదించడం చాలా బాధ కలిగించిందంటూ ఓ వీడియో సందేశం వెలువరించారు. ఆయన న్యాయవాదిగానే కాకుండా, ఆర్థికమంత్రిగా, ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అప్పటి పరిస్థితులను ఎదుర్కొన్న విధానం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో మగ్గిన వైనం ఆయన స్థయిర్యానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, సహచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.