తెలుగుదేశం శిబిరంలో ఉన్నది పెయిడ్ ఆర్టిస్టులే.. ఓ ఆర్టిస్టుకు రూ.5,000 ఇచ్చారు!: జోగి రమేశ్

0
3
తెలుగుదేశం శిబిరంలో ఉన్నది పెయిడ్ ఆర్టిస్టులే.. ఓ ఆర్టిస్టుకు రూ.5,000 ఇచ్చారు!: జోగి రమేశ్

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • శాంతిభధ్రతలను విచ్ఛిన్నం చేసేందుకు బాబు కుట్ర
  • గాలివార్తలు పోగు చేసి రాయించడం బాబుకు అలవాటే
  • గుంటూరులో మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే

                                         వివరాల్లోకి వెళితే…పల్నాడులో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేయడానికే టీడీపీ నేత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. ప్రజాస్వామ్యం అనే మాటను నోటి వెంట పలికేందుకు చంద్రబాబుకు అర్హత లేదని దుయ్యబట్టారు. గుంటూరులో జిల్లాలో ఈరోజు వైసీపీ నేతలతో కలిసి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ప్రశాంతంగా ఉన్న ఆత్మకూరును కలుషితం చేసేందుకు చంద్రబాబు చేపట్టిన కుట్ర ఇది. ఇక్కడ ఏమీ లేదని శిబిరాల్లో ఉన్నవాళ్లే చెప్పారు. ఈ శిబిరాలకు గిరిపురం నుంచి కూడా ఓ పెయిడ్ ఆర్టిస్టు వెళ్లారు. అతనికి టీడీపీ నేతలు రూ.5,000 ఇచ్చారు. ఇలాంటి డ్రామాలు చేసిచేసే కదా చంద్రబాబు ఈ స్థాయికి దిగజారింది. అసలు దాడులు జరిగిందన్నది నిజమే కాదు. గాలిని పోగు చేయడం, గాలివార్తలు రాయించడం చంద్రబాబుకు మామూలే’ అని జోగి రమేశ్ విమర్శించారు.