నన్ను రెచ్చగొట్టారు: చింతమనేని

0
3
నన్ను రెచ్చగొట్టారు: చింతమనేని

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
  • నన్ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు?
  • ఏ విచారణకైనా నేను సిద్ధమే

                                          వివరాల్లోకి వెళితే…తనపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ప్రతి మనిషికీ ఒక నీతి అనేది ఉంటుందని… కానీ, ఏ ధర్మం ప్రకారం పోలీసులు తనపై ఇన్ని అక్రమ కేసులను పెట్టారని ప్రశ్నించారు. ఎందుకు తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని అడిగారు. తన మనుషులను, తన కార్యకర్తలను ఎందుకు ఇబ్బందులపాలు చేస్తున్నారని అన్నారు. తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువలను కూడా పోలీసులు పగలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. పోలీసులు తనను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు. ఇన్ని రోజులు తాను బయటకు రాలేదని… తన పనేదో తాను చేసుకుంటున్నానని… కానీ తనను రెచ్చగొట్టారని… ఏ విచారణకైనా తాను సిద్ధమని చింతమనేని అన్నారు.