మందుబాబు చిల్లర దొంగతనం…ఆ బ్రాండ్‌ మాత్రమే చోరీ!

0
5
మందుబాబు చిల్లర దొంగతనం…ఆ బ్రాండ్‌ మాత్రమే చోరీ!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరుకుకు కొరత
  • తమకు నచ్చిన బ్రాండ్‌ కోసం దొంగతనం
  • ఒక్క కేసు మాత్రమే మాయం

కష్టపడి షాపునకు కన్నం వేశారు. పక్కాగా లోపలికి ప్రవేశించారు. ఓ బ్రాండ్‌ మద్యం కేసు మాత్రమే ఎత్తుకెళ్లారు. ఉదయం షాపులోకి అడుగుపెట్టిన నిర్వాహకులు జరిగిన దొంగతనం, పోయిన సరుకు చూసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు ఒకటి నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా కంభంలోనూ ఓ షాపు ఏర్పాటైంది. అయితే ఈ షాపుల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్లు లభించడం లేదు. పైగా మనిషికి మూడు బాటిళ్లకు మించి ఇవ్వడం లేదు.దీంతో కొరత అధిగమించేందుకు చోరీకి పాల్పడ్డారు కొందరు గర్తు తెలియని వ్యక్తులు. రేకుల షెడ్డుతో ఉన్న షాపు పైకప్పునకు కన్నంవేసి లోనికి ప్రవేశించారు. ఎంసీ విస్కీ కేసు ఒక్కదాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే ఇది చూసి షాకైన షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలిని సందర్శించిన పోలీసులు ‘భలే చిల్లర దొంగలు’ అని నవ్వుకున్నారు.