మరో కొత్త దర్శకుడికి అవకాశమిస్తోన్న నాగ్

0
0
మరో కొత్త దర్శకుడికి అవకాశమిస్తోన్న నాగ్

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • అభిమానులను నిరాశ పరిచిన ‘మన్మథుడు 2’
  • చైతూ బిజీ కారణంగా ‘బంగార్రాజు’ ప్రాజెక్టు లేట్ 
  • మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ్ మూవీ?

                                          వివరాల్లోకి వెళితే…‘మన్మథుడు 2’ సినిమా ఫలితం నిరాశ పరచడంతో నాగ్ అభిమానులు డీలాపడిపోయారు. ఈ సినిమా తరువాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా చేయనున్నాడు. అయితే అందుకు ముహూర్తమే కుదరడం లేదు. ఈ సినిమాలో నాగ్ తో పాటు చైతూ కూడా నటించనున్నాడు. ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలు ఎక్కువ. ప్రస్తుతం చైతూ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. అందువలన ఆయన కమిట్ మెంట్స్ పూర్తయ్యేలోగా నాగ్ మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో వున్నారు. ‘మహర్షి’ సినిమా స్క్రిప్ట్ విభాగంలో పనిచేసిన సాల్మన్ ఇటీవల నాగ్ కి ఒక కథ వినిపించాడట. ఈ కథ నాగ్ కి బాగా నచ్చేయడంతో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా సాల్మన్ ను దర్శకుడిగాను నాగ్ పరిచయం చేయనున్నారట. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుందని సమాచారం. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.