రాజోలు పీఎస్ లో లొంగిపోయిన ‘జనసేన’ ఎమ్మెల్యే రాపాక

0
2
రాజోలు పీఎస్ లో లొంగిపోయిన ‘జనసేన’ ఎమ్మెల్యే రాపాక

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి కేసు
  • ఈ కేసులో ‘ఏ1’గా ఉన్నరాపాక
  • రాజోలుకు చేరుకుంటున్న ‘జనసేన’ కార్యకర్తలు

                                      వివరాల్లోకి వెళితే… తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కొద్దిసేపటి క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఆయన ‘ఏ1’ నిందితుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజోలుకు చేరుకుంటున్నారు. దీంతో, రాజోలు పోలీస్ స్టేషన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాగా, మలికిపురంలో పేకాడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని విడిచి పెట్టాలని రాపాక, అతని అనుచరులు ఎస్సైతో ఘర్షణ పడ్డారు. పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో రాపాక, ఆయన అనుచరులపై పోలీస్ కేసు నమోదైంది.