‘సాహో’ లీక్స్… ఈ ఐదు సీన్స్ హైలైట్ అట!

0
5
‘సాహో’ లీక్స్… ఈ ఐదు సీన్స్ హైలైట్ అట!

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • ప్రభాస్ ఎంట్రీ సీన్, గన్ ఫైట్ హైలైట్
  • ఆపై జెట్ మ్యాన్ సీన్, కార్ చేజ్
  • క్లయిమాక్స్ కూడా సూపరని వార్తలు

                                         వివరాల్లోకి వెళితే….హై బడ్జెట్ మూవీగా, ప్రభాస్, శ్రద్ధాకపూర్ లు జంటగా నటిస్తున్న ‘సాహో’ ఎల్లుండి థియేటర్లను తాకనుంది. ఇక ఈ సినిమా సెన్సార్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పూర్తి కాగా, పలువురు చిత్రంలోని సీన్ల గురించి లీకులు ఇస్తున్నారు. ఈ సినిమాలో ఐదు సీన్స్ హైలైట్ అంటున్నారు. వీటిల్లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి. ఫ్యాన్స్ గూస్ బంప్స్ అయ్యేలా ఈ సీన్ ఉంటుందని సమాచారం. ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ పెంగ్ జాంగ్ దీన్ని డైరెక్ట్ చేయగా, ఈ సీన్ కోసం ప్రభాస్ మూడు వారాల పాటు ప్రత్యేక ట్రయినింగ్ తీసుకున్నాడట. ఇక రెండో సీన్ విషయానికి వస్తే, గన్ ఫైట్. దీన్ని బాబ్ బ్రాన్ డైరెక్ట్ చేశాడు. డ్యాన్స్ నంబర్ లా ఉండే ఈ ఫైట్ ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకూ రాలేదట. దీని తరువాతి హైలైట్ కార్ ఛేజ్. ఈ సీన్స్ కోసం మరో ఇంటర్నేషనల్ డైరెక్టర్ కెన్నీ బ్యాట్స్ డైరెక్ట్ చేశారు. దీన్ని మూడు వారాల పాటు అబూదాబీలో షూట్ చేశారు. నాలుగో హైలైట్ విషయానికి వస్తే ఇది జెట్ మ్యాన్ సీన్. ఈ సీన్ ను ‘బాహుబలి’ షూటింగ్ పూర్తికాకుండానే తీశారు. ‘బాహుబలి-2’ ప్రీ రిలీజ్ లో విడుదల చేసిన టీజర్ లోనే చూపించారు. ఈ సీన్స్ ఇటలీలో షూట్ చేశారు. జెట్ సూట్ వేసుకుని ప్రభాస్ గాల్లో తేలిపోతూ అద్భుతంగా నటించారట.