‘సాహో’ కోసం 120 ఖరీదైన కార్లను ఉపయోగించారట!

0
4
‘సాహో’ కోసం 120 ఖరీదైన కార్లను ఉపయోగించారట!

(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….

  • ప్రభాస్ కథానాయకుడిగా ‘సాహో’….
  • హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్స్ ….
  • ఆగస్టు 15వ తేదీన విడుదల …. 

                          వివరాల్లోకి వెళితే…సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా ‘సాహో’ రూపొందింది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఎక్కువమంది ఈ సినిమా కోసం పనిచేశారు. హాలీవుడ్ సినిమాల తరహా యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో కనిపించనున్నాయి.ఈ సినిమా మొత్తం మీద యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ కోసం ఖరీదైన కార్లను 120 వరకూ ఉపయోగించారట. కేవలం దుబాయ్ లో చేసిన ఒక ఛేజింగ్ సీన్ కోసం 56 కార్లను వాడినట్టుగా చెబుతున్నారు. మరో యాక్షన్ సీక్వెన్స్ కోసం 18 కార్లను ఉపయోగించారని అంటున్నారు. ఇలా ఈ సినిమా కోసం 120 ఖరీదైన కార్లను ఉపయోగించినట్టు సమాచారం. ఈ స్థాయిలో ఖరీదైన కార్లను ఉపయోగించిన తొలి సినిమా ‘సాహో’నే అవుతుందని చెబుతున్నారు.