‘మన్మథుడు 2’ కోసం 24 కోట్లు ఖర్చు అయిందట

0
1
‘మన్మథుడు 2’ కోసం 24 కోట్లు ఖర్చు అయిందట

(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • నాగ్ నుంచి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • అంతకంతకీ పెరుగుతోన్న అంచనాలు
  • ఆగస్టు 9వ తేదీన విడుదల   

                                      వివరాల్లోకి వెళితే…నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ ‘మన్మథుడు 2’ సినిమాను రూపొందించాడు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాగార్జున పారితోషికం కాకుండా ఈ సినిమా కోసం 24 కోట్ల వరకూ ఖర్చు చేశారట. శాటిలైట్ రైట్స్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ ద్వారా ఆల్రెడీ ఈ మొత్తం వచ్చేశాయట. ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ కారణంగా థియేట్రికల్ బిజినెస్ భారీస్థాయిలోనే జరుగుతుందని అంటున్నారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాగార్జునకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.