నెల్లూరులో అక్రమ కట్టడాలంటూ టీడీపీ నేతల 3 ఇళ్లను కూల్చేశారు….

0
6
నెల్లూరులో అక్రమ కట్టడాలంటూ టీడీపీ నేతల 3 ఇళ్లను కూల్చేశారు….

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • కూల్చివేతలే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతోంది
  • ఈ దౌర్జన్యానికి పోలీసులు అండగా నిలుస్తున్నారు
  • జగన్ గారూ.. అధికారం మీకు శాశ్వతం కాదు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత, మాజీ మంత్రి

                                     వివరాల్లోకి వెళితే…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. కూల్చివేతలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టీడీపీ నాయకులకు చెందిన 3 ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణగా నివాల్సిన పోలీసులు వైసీపీ దౌర్జన్యాలకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు.  ముఖ్యమంత్రి జగన్ కు కక్షసాధింపులు, కూల్చడాలే చేతనవుతాయని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్.. టీడీపీ నేతల ఇళ్లను కూల్చివేస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు.