కడపలో దసరా వేడుకల్లో అపశ్రుతి.. బుగ్గిపాలైన రూ.50 లక్షల ఆస్తి……..

0
5
కడపలో దసరా వేడుకల్లో అపశ్రుతి.. బుగ్గిపాలైన రూ.50 లక్షల ఆస్తి……..

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • కడప జిల్లాలోని బీకేఎం వీధిలో ఘటన
  • అమ్మవారి ఊరేగింపులో బాణసంచా కాల్పులు
  • నిప్పు రవ్వలు ఎగసిపడి దగ్ధమైన గోడౌన్

దసరా సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపులో భాగంగా బాణసంచా కాల్చడంతో నిప్పు రవ్వలు ఎగసిపడి ఓ గోదాంలోని అట్టపెట్టెలపై పడ్డాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో మంటలు వ్యాపించి గోదాం దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.50 లక్షల విలువైన ఆస్తినష్టం జరిగింది. కడపలోని బీకేఎం వీధిలో జరిగిందీ ఘటన. ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.