5న ఐదు నియోజకవర్గాల్లో సీఎం పర్యటన…………

0
4
5న ఐదు నియోజకవర్గాల్లో సీఎం పర్యటన…………

కర్నూలు న్యూస్‌టుడే: తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 5వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు రానున్నారు. నందికొట్కూరు, కోడుమూరు, ఆదోని, ఆలూరుతోపాటు డోన్‌ నియోజక వర్గాల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయనున్నారు. అదే రోజు రాత్రి కర్నూలు లేదా నంద్యాలలో బస చేసి మర్నాడు మరో జిల్లాకు వెళ్లనున్నారని తెదేపా వర్గాలు పేర్కొన్నాయి.సి.బెళగల్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్లు టీబీపీ దిగువకాలువ ప్రాజెక్టు మాజీ ఛైర్మన్‌ సీబీ విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సి.బెళగల్‌లో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ గ్రామసమీపంలో ఉన్న పొలాన్ని హెలీప్యాడ్‌ కోసం అనువునుగా ఉన్నట్లు తెలిపారు. సభాస్థలి, వేదిక, వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లపై కోడుమూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రామాంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజేష్‌, నాయకులు పాండురంగన్న, చిన్నమునెప్ప, మధుస్వామితో చర్చించారు. 

                                                                                                                  డెస్క్ :వసుధ