తండ్రికి తల కొరివి పెట్టిన కూతురు….

0
6
తండ్రికి తల కొరివి పెట్టిన కూతురు….

విజయనగరం న్యూస్ టూడే: సాధరణంగా ఎవరినా మృతి చెందితే అతనికి దహన సంస్కారాలు పురుషులు చేస్తారు .మృతి చెందిన వ్యక్తి పురుషుడు అయితే పెద్ద కుమారుడు తల్లి అయితే చిన్న కుమారుడు దహనసంస్కారాలు నిర్వహించేందుకు ముందు తలకొరివి పెట్టడం సంప్రాదాయం .కాని జలుమూరు మండలంలో చెన్నయవలసలో కావాటి పొట్టయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందగా అతని కూమర్తె బండి భాగ్యం తలకొరివి పెట్టి తండ్రి ఋణం తీర్చుకుంది .పొట్టయ్య భార్య చాలా ఏళ్ళ క్రితం చనిపోయింది వీళ్ళకు కుమారులు లేరు ,కూమార్తె ఉంది .పొట్టయ్య మరో వివాహం చేసుకోకుండా కుమార్తె భాగ్యంను కొడుకులా పెంచి పెద్ద చేసి వివాహం చేశాడు .తాను మృతి చెందితే అల్లుడుతో కాకూండా నీవే నాకు తలకొరివి పెట్టాలని తరచూ చెప్పేవాడు .తన తండ్రి కోరికపై తాను ఇలా తలకొరివి పెట్టినట్లు భాగ్యం తెలిపింది .                    డెస్క్: వి.సుప్రియ బి.కీర్తి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here