అభిమాని రూపొందించిన ఆర్ఆర్ఆర్ పోస్టర్ వైరల్ ….

0
4
అభిమాని రూపొందించిన ఆర్ఆర్ఆర్ పోస్టర్ వైరల్ ….
న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….
  • ఎన్టీఆర్ పిక్ ను షేర్ చేసిన శ్రేయాస్ గ్రూప్…  
  • ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ఇలాగే ఉంటాడు అనుకునేలా డిజైన్ర్…
  • ఆశ్చర్యపోయిన శ్రేయాస్ గ్రూప్…
                  వివరాల్లోకి వెళితే…..టాలీవుడ్ లో భారీ ప్రాజక్టులకు పెట్టిందిపేరైన ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇదేనంటూ ఫ్యాన్స్ తయారుచేసిన ఓ పోస్టర్ సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి నిజంగా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఇలాగే ఉంటాడేమోనని ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా గ్రూప్ కూడా నమ్మేసింది. ఈ సంస్థే తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ పోస్టర్ ను షేర్ చేసింది. ఓ అభిమాని రూపొందించిన ఈ పోస్టర్ చూసి ఒక్క క్షణం నిజమైన పోస్టరేమో అనుకున్నామని, ఓ అభిమాని చేతిలో ఇంత కచ్చితమైన రీతిలో పోస్టర్ రావడం అద్భుతం అని శ్రేయాస్ గ్రూప్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.