న్యూస్ టుడే:ఆక్లాండ్:నేడు జరిగిన భారత్,న్యూజిలాండ్ రెండో టీ20లో రోహిత్ సేన అదరగొట్టింది.టాస్ నెగ్గి తొలుత బ్యాటింకు దిగిన న్యూజిలాండ్‌ను భారత్ బౌలర్లు ముచ్చమటలు పట్టించారు.వరుస వికేట్లు తీసి 50 కే 4 వికేట్లు తీశారు.టేలర్ 42తో మరియు కోలిన్ 50తో టీంను ఆదుకున్నారు.పాండ్యా బ్రదర్స్‌లో క్రునాల్ పాండ్యా 3 వికేట్లతో,ఖలీల్ అహ్మద్ 2వికేట్లతో,భువనేశ్వర్ కుమార్,హార్దిక్ పాండ్యా చెరో ఒక వికేట్తో న్యూజిలాండ్‌ను 20 ఓవర్లలో 158కి8 వికేట్లకు మట్టికరిపించారు.తరువాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ బ్యాట్ మెన్లు న్యూజిలాండ్ బౌలర్లను చుక్కలు చూపించారు.రోహిత్ అర్ధసెంచరితో,రిషబ్ పంత్ 40,ధావన్ 30తో చెలరెగగా ధోని తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.18.5ఓవర్లలో 162-3తో ఆటను ముగించారు.మూడు కీలక వికెట్లు తీసిన క్రునాల్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్”గా నిలిచాడు.అదే క్రమంలో అర్ధ సెంచరితో చెలరేగిన రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు.దీనితో మూడు టీ20ల సిరీస్‌లో 1-1తో భారత్ సమం చేసింది.