నాకు మీసాలొచ్చిన తర్వాత ఎవరినీ, ఏదీ అడుక్కోలేదు………

0
1
నాకు మీసాలొచ్చిన తర్వాత ఎవరినీ, ఏదీ అడుక్కోలేదు………

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..

  • వైసీపీ తరపున నాకు ఏ పదవి కావాలని అడిగారు
  • నాకు ఏ పదవీ వద్దన్నాను
  • జగన్ సీఎం అయితే చాలని చెప్పాను

ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ తరపున తనకు ఏ పదవి కావాలని మొన్నటి ఎన్నికలకు ముందే తనను అడిగారని, జగన్ సీఎం అయితే చాలు, తనకు ఏ పదవీ వద్దని చెప్పానని పోసాని అన్నారు. కొంతమంది పదవులు ఇష్టపడతారని, ఎగబడి పదవులు తీసుకునే అలవాటు తనకు లేదని స్పష్టం చేశారు.‘నాకు మీసాలు వచ్చిన తర్వాత నాకై నేను ఎప్పుడూ, ఎవరినీ, ఏదీ ఇంత వరకూ అడుక్కోలేదు. సినిమా ఇండస్ట్రీలో గానీ, ఉద్యోగం విషయంలో గానీ, మరోచోట గానీ నేను ఎవ్వరినీ బెగ్గింగ్ చేసిందే లేదు. ‘ఎవరైనా ఈ పని నువ్వు చేస్తే బాగుంటుంది మురళి. ఇది నువ్వు చేసి పెట్టవా, ఇది నువ్వు చెయ్యవా’ అని అడిగితే తాను తప్పకుండా చేస్తానని అన్నారు.