ఐటీ గ్రిడ్స్‌కార్యాలయంసీజ్‌

0
11
ఐటీ గ్రిడ్స్‌కార్యాలయంసీజ్‌

హైదరాబాద్ న్యూస్‌టుడే:

  • తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృం దం (సిట్‌) విచారణ వేగవంతమైంది.
  • ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
  • మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఐటీ గ్రిడ్స్‌ కార్యాల యాన్ని అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు.
  • అందులో వున్న హార్డ్‌ డిస్క్‌ను పోలీసులు ఇదివరకే స్వాధీనం చేసుకు న్నారు.

కార్యాలయంలో మిగిలిన కంప్యూటర్లను శుక్రవా రం స్వాధీనం చేసుకుని సీల్‌ వేశారు. కార్యాలయం వద్దకు ఇతరులెవరూ రాకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. ఐటీగ్రిడ్స్‌ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌ డేటాను బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణులు, ఎథిక్‌ హ్యాకర్స్‌ సాయంతో విశ్లేషిస్తున్నారు. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సీఈఓ అశోక్‌ని అరెస్ట్‌ చేసేందుకు సిట్‌ అధి కారులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన సమాచా రాన్ని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌, సీఐలు స్టీఫెన్‌ రవీంద్రకు మరోసారి వివరించినట్లు తెలుస్తోంది. అమెజాన్‌, గూగుల్‌ నుంచి సమా చారం వచ్చిన తర్వాత ఆ డేటాని మరోసారి విశ్లేషించనున్నారు.