అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్…….

0
6
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్…….

(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…  

  • అక్బరుద్దీన్ ‘15’ నిమిషాల వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ దృష్టి…
  • కేసు వివరాలను సేకరించిన ఎన్ఐఏ
  • 29న రాష్ట్రవ్యాప్తంగా అక్బరుద్దీన్ దిష్టిబొమ్మల దహనం

                            వివరాల్లోకి వెళితే…15 నిమిషాలు పోలీసులను పక్కనపెడితే దేశంలోని హిందూ-ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తామంటూ 2013లో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం మరోమారు దృష్టి సారించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ ఆయనపై నమోదైన అన్ని కేసులను తిరగదోడి కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అక్బరుద్దీన్‌ నాటి వ్యాఖ్యలపై కేంద్రం తాజాగా దృష్టిసారించడానికి కారణం రెండు రోజుల క్రితం కరీంనగర్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. ఇటీవల కరీంనగర్‌లో మాట్లాడిన అక్బరుద్దీన్.. 2013లో తాను చేసిన వ్యాఖ్యల నుంచి ఆరెస్సెస్ వారు ఇంకా కోలుకోలేదని, అందుకే తనను ద్వేషిస్తున్నారంటూ నాటి వ్యాఖ్యలను గుర్తు చేశారు. దీంతో స్పందించిన బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ అక్బరుద్దీన్‌పై ఫిర్యాదు చేశారు.