బీజేపీ ఎంపీ మూర్ముకు షాకిచ్చిన అమెజాన్……

0
1
బీజేపీ ఎంపీ మూర్ముకు షాకిచ్చిన అమెజాన్……

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • ఆన్ లైన్లో శాంసంగ్ ఫోన్ బుక్ చేసిన మూర్ము
  • పార్సిల్ లో వచ్చిన రెడ్ మీ 5ఏ బాక్స్
  • దాన్ని ఓపెన్ చేస్తే ఫోన్ స్థానంలో రాళ్లు

పశ్చిమబెంగాల్ మాల్దా నార్త్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీ ఖాజెన్ మూర్ముకు అమెజాన్ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే, మూర్ము తన కుమారుడి చేత ఆన్ లైన్లో శాంసంగ్ ఫోన్ ను బుక్ చేయించారు. అమెజాన్ నుంచి వారి ఇంటికి పార్సిల్ డెలివరీ అయింది. అయితే పార్సిల్ ను ఓపెన్ చేసిన వారికి షాక్ తగిలింది. తాము శాంసంగ్ ఫోన్ ఆర్డ్ చేస్తే రెడ్ మీ 5ఏ బాక్స్ వచ్చింది. సరే అని దాన్ని కాస్తా ఓపెన్ చేశారు. ఇక్కడ వారికి మరో షాక్ తగిలింది. ఫోన్ లో మొబైల్ స్థానంలో రాళ్లు కనిపించాయి. నిశ్చేష్టుడైన మూర్ము వెంటనే అమెజాన్ కు ఫిర్యాదు చేశారు.