సాంఘిక సంస్కరణల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి అంబేద్కర్…

0
5
సాంఘిక సంస్కరణల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి అంబేద్కర్…
పెదకాకాని:న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు……
* ఆయన జీవితమే ఒక పోరాటం ….
*సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి …
*దళితులు బలహీన  వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించిన మహోన్నత వ్యక్తి……
గుంటూరుజిల్లా పెదకాకాని సెంటర్లో ఆదివారం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 128 వ జయంతి వేడుకలు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం కృషి పట్టుదలతో సాగిన బి.ఆర్. అంబేద్కర్ జీవితం ఉద్యమాలకు ఊపిరి పోశారని, ఆయన జీవితమే ఒక పోరాటమని ముఖ్యంగా సాంఘిక సంస్కరణలు కోసం అనేక పోరాటాలు చేసిన యోధుడు  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన కృషి ఎనలేనిదని మనిషికి మనిషికి మధ్య ఉన్న కుల మతాల అడ్డుగోడలు తొలగించి సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తుది శ్వాస వరకు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కోసం కృషి చేశారని దళితులు బలహీన  వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొన్నూరు ఏరియా కార్యదర్శి నన్నపనేని శివాజీ, జనసేన నాయకులు సత్యనారాయణ, టి యస్. టి యు.సి నాయకులు కోడూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
                                                                                                                డెస్క్:దుర్గ