అందరికీ తీపి వార్త… డెస్క్: లక్ష్మీ

0
7
అందరికీ తీపి వార్త…    డెస్క్: లక్ష్మీ

అమరావతి న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు… 

  • తొలి కేబినెట్‌లోనే అద్భుత నిర్ణయాలు …  
  • మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మించి ప్రయోజనం …

                     వివరాల్లోకి వెళితే…   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గ తొలి సమావేశంలో నవరత్నాల పథకాల అమలుకే అగ్రప్రాధాన్యమని మంత్రులకు తేల్చిచెప్పారు. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిజానికి ఎన్నికల హామీల అమలుకు ఐదేళ్ల సమయం ఉన్నా.. ఆయన ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించకుండా కార్యాచరణ ప్రారంభించారు. మంత్రివర్గ తొలి సమావేశంలోనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్థిక భారం అవుతుందేమోనన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. ప్రజలకు మేలు చేయడం కంటే ఏదీ ముఖ్యం కాదని విస్పష్టంగా ప్రకటించారు.   ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్దిరోజుల్లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులతో పాటు అన్ని వర్గాలకు తీపి కబురును అందించింది.  

మీ ఆలోచనల్లో…
ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గ తొలి సమావేశం ద్వారా ఆచరణలో చూపిస్తున్నారా?