అమెరికాలోనే ఉన్నా.. ‘తానా’ సభలకు వెళ్లని దర్శకుడు రాజమౌళి……….

0
7
అమెరికాలోనే ఉన్నా.. ‘తానా’ సభలకు వెళ్లని దర్శకుడు రాజమౌళి……….

(టిన్యూస్10):న్యూస్‌టుడే: 

  • ఈ నెల 4, 5, 6 లో తానా సభ మహాసభలు
  • వాషింగ్టన్ డీసీలో ప్రత్యేక కార్యక్రమాలు
  • కీరవాణి మ్యూజిక్ షోకు రాలేనన్న రాజమౌళి

                             వివరాల్లోకి వెళితే….అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ నెల 4, 5, 6 తేదీల్లో తానా 22వ మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పందిస్తూ.. ప్రస్తుతం తాను వ్యక్తిగత పనిపై వాషింగ్టన్ డీసీకి వచ్చానని తెలిపారు. తానా సభలకు తాను వెళ్లడం లేదన్నారు. ‘ఫ్రెండ్స్.. పెద్దన్న(ఎం.ఎం.కీరవాణి) మ్యూజిక్ షోకు నేను హాజరుకాకపోవచ్చు. నేను వస్తానని అనుకుని ఎవ్వరూ బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ వివరణ ఇస్తున్నా’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.