అమిత్ షాకు చంద్రబాబు కౌంటర్…

0
6
అమిత్ షాకు చంద్రబాబు కౌంటర్…

 అమరావతి న్యూస్ టుడే: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఏపీ సీఎం చంద్రబాబు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలు నేరవేర్చాలని అడిగితే ఎదురుదాడి చేయడం ఏంటని, ఇది ఎంత దుర్మార్గమని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అమిత్ సా తనయుడు ఆస్తులు 16వేల రెట్లు పెరిగితే దర్యాప్తు జరపరా? అని చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. 

ఏపీకి కేంద్రం రూ. 2 లక్షల 44వేల కోట్లు ఇచ్చిందన్న బీజేపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. హైవేలు ఏపీకి ఎన్ని ఇచ్చారో.. గుజరాత్‌కు ఎన్ని ఇచ్చారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. తాను యూటర్న్ తీసుకోలేదని, తనది రైట్ టర్న్ అని.. బీజేపీదే వంకరటింకర టర్నింగ్ అని కౌంటరిచ్చారు. పుత్రవాచ్ఛల్యంతో అవినీతికి పాలపడిన తన కొడుపై చర్యలు తీసుకోని అమిత్ షా.. తనను విమర్శించే అర్హత లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆపేది లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

                                                                                  డెస్క్: వి.సుప్రియ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here