అంపైరాంగ్‌!

1
6
అంపైరాంగ్‌!
(టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు……..

  •  ప్రపంచకప్‌లో నోరెళ్లబెట్టేలా అంపైరింగ్‌ నిర్ణయాలు….
  •  భారత్‌తో సెమీస్‌లో 74 పరుగులు చేసిన రాస్‌ టేలర్‌… 
 
                        వివరాలోకి వెళితే….ఐసీసీ ఈవెంట్‌.. అందునా ప్రపంచకప్‌లో అంపైరింగ్‌ నిర్ణయాల్లో తేడా వల్ల ఫలితాల్లోనే తేడా వచ్చేసింది. జట్ల రాతలు మారిపోయాయి. ప్రపంచకప్‌ జరుగుతున్నపుడు, అయిపోయాక కూడా అంపైరింగ్‌ నిర్ణయాలపై ఎడతెగని చర్చ జరగడం ఇప్పుడే చూస్తున్నాం. కోహ్లి, రాయ్‌ల ఉదంతాలే కాదు.. ఈ ప్రపంచకప్‌లో నోరెళ్లబెట్టేలా అంపైరింగ్‌ నిర్ణయాలు చాలానే ఉన్నాయి. ఆ నిర్ణయాలకు బలైన ఆటగాళ్లు ఎందరో! వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో రోహిత్‌శర్మ బ్యాట్‌కు బంతి ఎంతో దూరంలో ఉన్నా.. సమీక్షలో మూడో అంపైర్‌ ఔటిచ్చాడు. భారత్‌తో సెమీస్‌లో 74 పరుగులు చేసిన రాస్‌ టేలర్‌ను ఫైనల్లో కీలక సమయంలో అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడు. అప్పటికే గప్తిల్‌ డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకోవడంతో టేలర్‌కు సమీక్ష కోరే అవకాశం లేకపోయింది. అయితే రీప్లేలో బంతి వికెట్ల పై నుంచి వెళ్తుందని స్పష్టంగా తేలింది.

1 COMMENT

Comments are closed.