అమరావతికే కాదు.. ఇకపై ఏ ప్రాజెక్టుకూ నిధులు రావు ……….

0
3
అమరావతికే కాదు.. ఇకపై ఏ ప్రాజెక్టుకూ నిధులు రావు ……….

ఆంధ్రప్రదేశ్:(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు… 

  • రైతుల చేత ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేయించారు
  • రాష్ట్రాభివృద్ధి వైసీపీకి అవసరం లేదు
  • నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు

                      వివరాల్లోకి వెళితే… నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వలేమని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రపంచబ్యాంకు రుణాన్ని తిరస్కరించిందంటూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి వైసీపీ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల చేత ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారని మండిపడ్డారు. ఒక్క అమరావతికే కాదు, ఏ ప్రాజెక్టుకు ఇకపై నిధులు రావని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి వీరికి అవసరం లేదని విమర్శించారు. రాష్ట్రమంతా పులివెందుల తరహా గొడవలు కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇసుక దొరక్క, దాని రేటు రెండింతలు పెరిగిపోయిందని… దీంతో, నిర్మాణరంగం కుదేలై, నిర్మాణ కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.