నేడు భద్రాద్రిలో రాముడి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం…

0
5
నేడు భద్రాద్రిలో రాముడి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం…

న్యూస్‌టుడే: భద్రా చలం   శ్రీరామ నవమి బ్రహోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో జగదబిరాముని కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం అనవాయితీ. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ రోజున శ్రీరామ నామస్మరణ చేస్తే మన మనసుకు ఆయనే రాజు అనే భావన స్థిరపడుతుంది. మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. పట్టాభిషేక మహోత్సవం కేవలం శ్రీరామునికి మాత్రమే జరిపిస్తారు. అనంతరం ఆయన మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.                                                                                                                  డెస్క్:వాసవి