బాబుపై మరో పంచ్ విసిరిన వర్మ…

0
4
బాబుపై మరో పంచ్ విసిరిన వర్మ…

(టిన్యూస్10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….  

  •  బ్రాహ్మానందంలా చంద్రబాబు కామెడీ చేశారు…. 
  •  అసెంబ్లీలో బాబు కామెడీ ట్రాక్ కొనసాగుతోందంటూ సెటైర్లు … 

                     వివరాల్లోకి వెళితే… తాను 40 ఇయర్స్ పాలిటిక్స్ అని.. తన రాజకీయ అనుభవం అంతా లేదు నీ వయసు అని జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. ఈ మాటలు మాట్లాడుతుండగా జగన్ పడిపడి నవ్వారు.దీన్నిబేస్ చేసుకొని వర్మ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో మరోసారి బ్రాహ్మానందంలా చంద్రబాబు కామెడీ చేశారని.. అందుకే జగన్ నవ్వేశారని వర్మ సెటైర్ వేశారు. ఏపీ అసెంబ్లీలో బాబు కామెడీ ట్రాక్ కొనసాగుతోందంటూ సెటైర్లు వేశారు.గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వర్మ ఇలాగే పంచులిస్తే ఆయన సినిమాలు ఆడకుండా అడ్డుకున్నారు. వర్మ పై కేసులు పెట్టారు. ఇప్పుడు జగన్ అధికారంలో ఉండడంతో వర్మ రెచ్చిపోతూనే ఉన్నాడు.