ఏపీ బడ్జెట్ 2019-20.. ముఖ్యాంశాలు-2

0
4
ఏపీ బడ్జెట్ 2019-20.. ముఖ్యాంశాలు-2

ఆంధ్రప్రదేశ్:(టిన్యూస్10):న్యూస్‌టుడే: 

  • బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
  • పేదల కన్నీటిని తుడిచేలా బడ్జెట్ ఉందని వ్యాఖ్య
  • ప్రత్యేకహోదా, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యమని ప్రకటన

                     వివరాల్లోకి వెళితే….ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదల కన్నీటిని తుడిచేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు. ప్రతీ గ్రామానికి రక్షిత మంచినీరును అందిస్తామని అన్నారు. కృష్ణా నది ఆయకట్టు స్థిరీకరణ, ఏపీకి ప్రత్యేకహోదా లక్ష్యంగానే ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీచేసే కాంట్రాక్టుల్లో పారదర్శకత పాటిస్తామన్నారు. ఏపీ అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను బుగ్గన ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేర్వేరు రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులను మంత్రి ప్రకటించారు.