అయోధ్య తుది తీర్పుపై ఏపీ సీఎం జగన్ స్పందన……

0
0
అయోధ్య తుది తీర్పుపై ఏపీ సీఎం జగన్ స్పందన……

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేశాయి
  • ఆ తర్వాతే తీర్పు వెలువడింది
  • రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదు

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. ‘అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది’ అని అన్నారు.‘ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.