ఆపిల్ పాన్ కేక్…..

0
2
ఆపిల్ పాన్ కేక్…..

కావాల్సిన పదార్ధాలు:-

  • గోధుమ పిండి – 1 /2 కప్పు
  • మైదా పిండి – 1/2 కప్పు
  • ఆపిల్ కోరు – 1/2 కప్పు
  • కుకింగ్ బటర్ – 5 చెంచాలు
  • తేనె – 5 చెంచాలు
  • అరటిపండు గుజ్జు – 1/2 కప్పు
  • నీళ్ళు – తగినంత

తయారు చేయు విధానం:-
ఒక బౌల్ లో గోధుమ పిండి, మైదా పిండి, ఆపిల్ కోరు, అరటిపండు గుజ్జు, రెండు చెంచాల బటర్, కొంచెం నీరుపోసి కలపాలి. 
అయితే దీనిని మరీ జోరుగా కాకుండా, గట్టిగా కాకుండా  దోశల పిండిలా కలుపుకోవాలి. 
మరోపక్కన పెనం మీద బటర్ వేసి ఆ పైన ఈ పిండిని దోశలా వేయాలి. ఇలా వేస్తే దోశలు కొంచెం మందంగా వస్తాయి. 
ఇప్పుడు దోశను రెండు వైపులా కాల్చి తీసి, ప్లేట్‌లో పెట్టి ఇవ్వొచ్చు. అయితే పాన్ కేక్ మీద తేనె కూడా రాసుకుని తినవచ్చు.