అరటిపండు పాయసం…..డెస్క్:దుర్గ

0
9
అరటిపండు పాయసం…..డెస్క్:దుర్గ

కావలసిన పదార్థాలు:  

  • పండిన అరటిపళ్ళు: రెండు,
  • నీరు:కప్పు,
  • బెల్లం: 350 గ్రాములు,
  • కొబ్బరి పాలు: రెండు కప్పులు.
  • కొబ్బరిపాలు: కప్పు 
  • నెయ్యి: నాలుగు లేదా ఐదు టీస్పూన్లు,
  • యాలకుల పొడి: అర టీస్పూను,
  • జీడిపప్పు: 50 గ్రాములు,
  • కిస్మిస్‌: 20 గ్రాములు,
  • కొబ్బరి ముక్కలు: అర టేబుల్‌ స్పూను. 

తయారీ విధానం: అరటిపండును ముక్కలుగా చేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించి, అనంతరం నీటిని వంపేసి ముక్కలను ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి నీటిని చేర్చి పాలను తీసుకోవాలి. కప్పు చిక్కటి పాలు తీసి పక్కన పెట్టుకుని ఆ తరువాత వాటిలో కొద్దిగా నీటిని కలుపుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని నెయ్యి వేసుకొని కాగిన తరువాత జీడిపప్పు, కిస్మిస్‌లు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సిద్ధంగా ఉంచిన అరటిపండు ముద్దను ఈ నేతిలోనే వేసి రెండు నిమిషాలు ఉడికించి అనంతరం బెల్లం వేసి కరిగేంత వరకూ ఉడికించుకోవాలి.  ఓ ఐదు నిమిషాలు ఉడికించిన తరువాత చిక్కటి పాలు కూడా జతచేయాలి.