ఆర్ కామ్ కు ఊరట..

0
6
ఆర్ కామ్ కు ఊరట..

న్యూఢిల్లీ న్యూస్ టుడే: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు ఇక్కడి టెలికం డిస్ప్యూట్‌ సెటిల్మెంట్‌ అండ్‌ అప్పి లేట్‌ ట్రైబ్యునల్‌ (టీడీసాట్‌)లో సోమవారం నాడు భారీ ఊరట లభించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు… డాట్‌కు ఇచ్చిన రూ.2,000 కోట్ల బ్యాంకు గ్యారంటీని తిరిగి ఇచ్చేయాలని టీడీసాట్‌ ఆదేశించింది. అలాగే ఆర్‌కామ్‌ వద్ద ఉన్న సీడీఎంఏ, జీఎస్‌ఎం బ్యాండ్‌ స్రెక్టమ్‌కు వన్‌టైం సెక్ట్రమ్‌ చార్జీలు (ఓటీఎస్‌సీ) నుంచి మినహాయింపులు ఇచ్చిందని ఆర్‌కామ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా కేంద్ర కేబినెట్‌ 2012లొనే 6.2 మెగాహర్జ్‌ స్పెక్ట్రమ్‌ దక్కించుకున్న ఆపరేటర్లు జులై 2008 నుంచి జనవరి 1, 2013 వరకు 4.4 మెగాహర్జ్‌ కంటే ఎక్కువ స్పెక్ట్రమ్‌ కలిగిన కంపెనీలు జనవరి 1, 2013 నుంచి ప్రారంభమయ్యే కాలానికి లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here