రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆశోక్ …

0
12
tnews10.com

న్యూస్ టుడే గుంటూరు : ధూళ్ళిపాళ్ళ గ్రామానికి చెందిన జన సైనికుడు మట్టం అశోక్‌ రోడ్డు ప్రమాదంంలో మరణించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జన సైనికుడు మట్టం అశోక్‌ కుటుంబానికి జనసేన నేతలు సోమవారం సంతాపం ప్రకటించారు. ఈ రోజు ఉదయం అశోక్‌ భౌతిక కాయాన్ని, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖరు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబం సభ్యులను పరామర్శించి పార్టీ తరుపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందచేశారు. అశోక్‌ అంత్యక్రియలలో పాల్గొన్నారు. జనసేన గుంటూరు జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ బైరాధిలీప్‌ చక్రవర్తి, జనసేన నాయకులు రావెల కిషోర్‌ బాబు, మన్నవ సోడేకర్‌ పుట్టి సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.

                                                                                          డెస్క్: రాఘవ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here