ఘనంగా జరిగిన అయ్యప్పస్వామి జన్మదిన వేడుకలు….

0
2
ఘనంగా జరిగిన అయ్యప్పస్వామి జన్మదిన వేడుకలు….
రెంటచింతల: న్యూస్‌టుడే:
* స్వామివార్లకు 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం ….
రెంటచింతల మండలంలోని గ్రామాలలో అయ్యప్పస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రెంటచింతల, పాలువాయిగేటు, మంచికల్లు అయ్యప్ప దేవాలయాలలో స్వామివార్లకు 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం భక్తుల సమక్షంలో చేశారు. 18 మెట్లపై ప్రమిదలు ఏర్పాటు చేసి వెలిగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు చేశారు.
                                                                                                                 డెస్క్:దుర్గ