బాబూ మీరు మాకు నీడ లాంటివారు…

0
15
బాబూ మీరు మాకు నీడ లాంటివారు…
గుంటూరుజిల్లా: బాపట్ల:న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
  • కంచర్ల పున్నమ్మ పేరు మీద ఛారిట్రబుల్ ట్రస్ట్ ఏర్పాటు.
  • ఆంధరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం ఉందని విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి కంచర్ల హరిప్రసాద్ అన్నారు.
  • బాపట్లో  శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
  • బాబు  నాయకత్వం సౌమర్ధ్యం, అమలు చేస్తున్న పధకాలు చూసి ఆకర్షితుడినై తెదేపాలో చేరినట్లు తెలిపారు.
ఆదాయపన్ను శాఖలో 30 ఏళ్ళ పాటు వివిధ హోదాల్లో పనిఛేశానన్నారు. తన తల్లి కంచర్ల పున్నమ్మ పేరు మీద ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సమాజ సేవా కార్యక్రమాలు చేబడుతున్నట్లు పేర్కొన్నారు. మరింత సేవ చేయాలనే రాజకీయాల్లో వచ్చానన్నారు. బాబు అవకాశం కల్పిస్తే బాపట్ల లోక్‌సభ నుంచి తెదేపా అభ్యర్ధిగా పోటీ చేస్తానని ఆయన వెలడించారు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కష్టపడి పనిచేసి గెలిపిస్తామన్నారు. చంద్రబాబు మరలా సీఎంగా వస్తేనే అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తయ్యి రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానం లో నిలుస్తుందన్నారు. సమావేశంలో పార్టీ నేతలు శామ్యూల్, గోపీ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
                                                                                                                   డెస్క్:దుర్గ