బార్బీ రూపంలో ఒసాకా

0
6
బార్బీ రూపంలో ఒసాకా
  • వరల్డ్‌ నెంబర్‌ వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి జపాన్‌ బామ నవోమి ఒసాకా తనను తాను బార్బీ బొమ్మ రూపంలో చూసుకుంది.
  • ఒసాకా బార్బీ బొమ్మ నమూనా, చిత్రం ఇండి యన్‌ వెల్స్‌లో అభిమానులకు కనువిందు చేసింది.
  • బిఎన్‌పి పరిబాస్‌ టోర్నీగా పేరుగాంచిన ఇండియన్‌ వెల్స్‌లో పాల్గొంటున్న ఒసాకా వరుసగా రెండు గ్రాండ్‌ స్లామ్‌లను గెలుచుకుని బార్బీస్‌ ‘షీరోస్‌’ (ధైర్యానికి, సాహసానికి మారుపేరు లేదా హీరోయిన్‌) జాబితాలో చోటు సంపాదించింది.
  • షీరోస్‌గా పేరుపొందిన వారి క్రీడాకారిణులను పోలిన బార్బీ బొమ్మలు రూపొందిస్తారు.
  • గతంలో షీరోస్‌గా నిలిచి జిమ్నాస్ట్‌ లారీ హెర్నాన్‌డెజ్‌, ఒలింపిక్‌ ఫెన్సర్‌ ఇబ్తాజ్‌ మహ్మద్‌ల బార్బీలు మార్కెట్లోకి వచ్చాయి.
  • ఈ చిత్రం ముందు నిలబడి ఒసాకా ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా ఒసాకా మాట్లాడుతూ..

‘ ఇది నాకు అపూర్వమైన గౌరవం. నేను బాల్యంలో బార్బీ బొమ్మలతో ఆడుకున్నాను’ అని అంది. 2018లో ఒసాకా తన తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ యూఎస్‌ ఓపెన్‌ను గెలుచుకుంది. అనంతరం ఆస్ట్రేలియా ఓపెన్‌ను కూడా గెలిచి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ హోదాను పొందింది. ఒసాకా తల్లి జపాన్‌ దేశస్థురాలు కాగా, తండ్రి హైతీ దేశస్థురాలు. నా రూపంలో ఉండే బార్బీ రూపొందడం నాకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొంది. ఈ టోర్నీలో చిన్నారులు నా ఆటోగ్రాఫ్‌కోసం వచ్చినప్పుడు బాల్య స్మృతులు గుర్తుకొచ్చాయి. నేను చిన్నప్పుడు టోర్నీలు సాగుతున్న సమయంలో నా కిష్టమైన ఆటగాళ్లకు మద్దతు తెలపడానికి వెళ్లేదాన్ని. వారిలాగా నేను కూడా కోర్టులో ఆడాలని కోరుకునే దాన్ని. ఆ కల నేరవేరింది. చాలామంది ఈవిధంగా కోరుకున్నప్పటికి.. నాకు అదృష్టం దక్కింది అని ఒసాకా పేర్కొంది.