బావా..మళ్లీ కుదరదేమో….

0
7
బావా..మళ్లీ కుదరదేమో….

తెలంగాణ:(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు… 

  • సచివాలయం, అసెంబ్లీ భూమి పూజకు హాజరైన కేటీఆర్, హరీష్
  • ఈ సందర్భంగా ముచ్చటించుకున్న ఇరువురు నేతలు
  • కేటీఆర్ వ్యాఖ్యలను చిరునవ్వులు చిందించిన హరీష్

                      వివరాల్లోకి వెళితే…ఈ రోజు తెలంగాణ సచివాలయం, అసెంబ్లీలకు భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ‘బావా.. మళ్లీ కుదరదేమో… మన పాత చాంబర్లను ఒకసారి చూసుకుందామా?’ అని హరీష్ రావుతో కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు హరీష్ చిరునవ్వులు చిందించారు. అనంతరం కార్యకర్తలతో ఇద్దరూ సెల్ఫీలు దిగి వెళ్లిపోయారు. మరోవైపు, వీరిద్దరినీ మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.