బాబు కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా?

0
3
బాబు కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా?

న్యూస్‌టుడే:  అన్నం మొత్తాన్ని కాదు.. మెతుకు ఒక్కదాన్ని చూస్తే చాలు దాని బతుకేందో చెప్పేయొచ్చంటారు. ఈ సామెతకు తగ్గట్లే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న గెలుపు లెక్కలు ఇదే తీరులో ఉన్నాయి. రాజకీయపార్టీలు అన్నాక.. అందులోకి అధికారపక్షమైనప్పుడు గెలుపు మీద ధీమాను వ్యక్తం చేయటం తప్పేం కాదు. కానీ.. సమస్య ఏమిటంటే.. తమకొచ్చేసీట్ల విషయంలో బాబు చెప్పిన లెక్కను చూసి ముక్కున వేలేసుకోవటం కనిపించింది. ఎందుకంటే.. ఎక్కడైనా ఎన్నికల్లో గెలిచే సీట్లను చెప్పే టప్పుడు రెండు ఫిగర్లను చెప్పటం.. వాటి మధ్య తేడా మహా అయితే పది సీట్లకు మించి ఉండనట్లుగా ఉంటుంది. అందుకు భిన్నంగా బాబు మాత్రం తానుచెప్పిన కనిష్ఠ సీట్లసంఖ్యకు.. గరిష్ఠ సీట్ల సంఖ్యకు మధ్య తేడా భారీగా ఉండటం గమనార్హం. ఎన్నికల్లో టీడీపీ గెలుపు పక్కా అని..నూటికి వెయ్యి శాతం తమదే గెలుపు అంటూ ఆయన బల్ల గుద్ది నమ్మకంగా చెబుతున్నారు.       

                                                                                                             డెస్క్:లక్ష్మీ