బాబుగారూ…మీ అనుభవంతో రాష్ట్రానికి ఏం ఒరిగింది……….

2
6
బాబుగారూ…మీ అనుభవంతో రాష్ట్రానికి ఏం ఒరిగింది……….

 ఆంధ్రప్రదేశ్ :(టిన్యూస్10): న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….  

  • అధికారం మీ విదేశీ ప్రయాణాలకు పనికి వచ్చింది
  • ఆర్థిక భారం మాత్రం ప్రజలపై పడింది
  • తప్పుడు హామీలతో ప్రజల్నిమభ్యపెట్టి పబ్బం గడుపుకొన్నారు 

                   వివరాల్లోకి వెళితే….మాట్లాడితే నలభై ఏళ్ల అనుభవం అని చెప్పే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుభవంతో రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారో చెప్పాలని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ అధికారం మీ విదేశీ పర్యటనలకు పనికి వచ్చిందేమోగాని, మీ విదేశీ పర్యటనల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కానీ మీరు చేసిన విదేశీ పర్యటనల ఖర్చు భారం మాత్రం ప్రజలపై పడిందన్నారు. తప్పుడు హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకొన్నారని,  ఏపీకి ఐటీ సంస్థలు వస్తున్నాయంటూ నిరుద్యోగ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి ఒరిగింది ఇదేనన్నారు.  

2 COMMENTS

  1. … [Trackback]

    […] Informations on that Topic: tnews10.com/babugaroo-what-has-the-state-been-like-with-your-experience/ […]

  2. … [Trackback]

    […] Find More Information here on that Topic: tnews10.com/babugaroo-what-has-the-state-been-like-with-your-experience/ […]

Comments are closed.