బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి ప్రతిపాదనలు….

1
5
బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి ప్రతిపాదనలు….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్లనిధులు… 
  • బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు మెరుగు… 

                 వివరాల్లోకి వెళితే….ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత బలోపేతం చేస్తున్నట్లు తన బడ్జెట్‌ప్రసంగంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల అదనపు మూలధన వనరులు కేటాయిస్తామన్నారు. శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలను వెల్లడిస్తూ ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకులో కాతా కలిగిన కాతాదారు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుసేవలను అందుకునేటట్లుచర్యలు తీసుకుంటున్నామన్నారు. మొండి బకాయిలతో సతమతం అవుతున్న బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయన్నారు. ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులను రుణసంక్షోభంనుంచి గట్టెక్కించామని, వాణిజ్యబ్యాంకుల్లో రూ.లక్షకోట్లమేర నిరర్ధకాస్తులు తగ్గాయన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండిబకాయిలు క్రమేపీ తగ్గుతున్నాయని ఆమెతెలిపారు. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను పటిష్టంచేసి మెరుగైన పనితీరుకనబరిచే ఎన్‌బిఎఫ్‌సిలకు బ్యాంకింగ్‌, మూచువల్‌ఫండ్స్‌నుంచి సహకారం అందేలాచూస్తామని చెప్పారు. అలాగే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నియంత్రణ,పర్యవేక్షణ బాధ్యతలను రిజర్వుబ్యాంకు పరిధిలోనికి తీసుకువస్తున్నట్లు ఆర్దిక మంత్రి వెల్లడించారు. ఇక విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసభారతీయులు ఎవరు ఉన్నావారి పాస్‌పోర్టు ఆధారంగా వారికి ఆధార్‌కార్డులుసైతం మంజూరవుతాయని ఆర్ధిక మంత్రి భరోసా ఇచ్చారు. 

1 COMMENT

  1. … [Trackback]

    […] There you will find 6115 more Infos: tnews10.com/badjetloa-aardhika-mamatri-pratipaadanalu/ […]

Comments are closed.