బయట పడ్డ వీవీప్యాట్స్ స్లిప్పుల కలకలం…

0
5
బయట పడ్డ వీవీప్యాట్స్ స్లిప్పుల కలకలం…

నెల్లూరు జిల్లా: న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…. 

*స్లిప్పులు బయటపడటంపై అనుమానాలు…
*స్కూల్ ఆవరణను పరిశీలించిన ఆర్డీవో…
*మరికొన్ని స్లిప్పుల్ని గుర్తించిన అధికారులు…
నెల్లూరు జిల్లాలో వీవీప్యాట్స్ స్లిప్పుల కలకలంరేపింది. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వీవీప్యాట్స్ స్లిప్పులు బయటపడ్డాయి. స్లిప్పులు చూసి షాకైన ఓ విద్యార్థి.. వాటిని అధికారులకు అప్పగించాడు. స్లిప్పులకు సంబంధించి సమాచారం అందుకున్న ఆర్డీవో స్కూల్‌ను పరిశీలించారు. అక్కడే స్కూల్ ఆవరణలో కవర్లలో మరికొన్ని స్లిప్పులు దొరికాయి.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు విచారణకు ఆదేశించారు. స్కూల్ ఆవరణలో దొరికినవి.. ఈవీఎంల ర్యాండమైజేషన్‌ చేసిన స్లిప్పులు కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. వాటిని కూడా భద్రపరచాల్సి ఉన్నా.. ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్థానిక అధికారుల్ని కలెక్టర్ వివరణ కోరారు. స్కూల్ ఆరవణలోకి ఈ స్లిప్పులు ఎలా వచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నారు.
                                                                                                                  డెస్క్:దుర్గ