బీర‌కాయ‌ మ‌సాలా……….

0
4
బీర‌కాయ‌ మ‌సాలా……….

కావల్సినపదార్ధములు:

 • బీరకాయలు – రెండు
 • ఉల్లిపాయలు – ఆరు
 • వెల్లుల్లి – ఐదు పాయలు
 • ఎండుమిర్చి – పది
 • జీలకర్ర – చెంచా
 • ధనియాలు – నాలుగు చెంచాలు
 • లవంగాలు – నాలుగు
 • దాల్చిన చెక్క -చిన్న ముక్క
 • ఉప్పు – తగినంత
 • నూనె – అరకప్పు
 • కరివేపాకు – రెండు రెబ్బలు
 • తాలింపు గింజలు – చెంచా

తయారీవిధానం: ముందుగా మిక్సీలో ఉల్లిపాయ ముక్కలూ, వెల్లుల్లి పాయలూ, ఎండుమిర్చీ, జీలకర్రా, ధనియాలూ, లవంగాలూ, దాల్చిన చెక్కా, తగినంత ఉప్పూ తీసుకుని మెత్తని ముద్దలా చేసి పెట్టుకోవాలి. బీరకాయల చెక్కుతీసి గుత్తివంకాయకు తరిగినట్లుగా ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ముందుగా తాలింపు గింజలు వేయాలి. అవి వేగాక కరివేపాకూ, బీరకాయ ముక్కలూ వేసి కలిపి మూత పెట్టేయాలి. కాసేపటికి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు ముందుగా చేసుకున్న మసాలా వేసి బాగా కలిపి మంట తగ్గించాలి. మసాలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతున్నప్పుడు దింపేయాలి.