బెంగళూరు బోణీ…..

0
8
బెంగళూరు బోణీ…..

1.. 2.. 3.. 4.. 5.. 6.. ఇలా మ్యాచ్‌లు లెక్క పెట్టుకుంటూనే సాగిపోయారు బెంగళూరు అభిమానులు. విజయం కోసం ఎన్ని ఎదురు చూపులో! మిగతా జట్లన్నీ మ్యాచ్‌ల మీద మ్యాచ్‌లు గెలిచేస్తుంటే.. ఒక్క విజయానికి కోహ్లి జట్టు ముఖం వాచిపోయింది. కొన్ని మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడితే.. కొన్ని మ్యాచ్‌లు చిక్కినట్లే చిక్కి చేజారాయి.

దాదాపు సగం టోర్నీ పూర్తవుతున్నా.. గెలుపు రుచి చూడలేక బెంగళూరు జట్టు, దాని అభిమానులు పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ఐతే ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. ఆర్‌సీబీ ఐపీఎల్‌ పన్నెండో సీజన్లో ఖాతా తెరిచింది. బెంగళూరు అతిగా ఆధారపడే కోహ్లి (67; 53 బంతుల్లో 8×4), డివిలియర్స్‌ (59 నాటౌట్‌; 38 బంతుల్లో 5×4, 2×6)లే జట్టుకు తొలి విజయాన్నందించడం విశేషం. వీరి మెరుపులతో క్రిస్‌ గేల్‌ (99 నాటౌట్‌; 64 బంతుల్లో 10×4, 5×6) ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌ వృథా అయింది.