దర్శక దిగ్గజం రాజమౌళికి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

0
5
దర్శక దిగ్గజం రాజమౌళికి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • ఈరోజు రాజమౌళి జన్మదినం
  • 1973 అక్టోబర్ 10న జన్మించిన దర్శక దిగ్గజం
  • ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి

                                                           వివరాల్లోకి వెళితే…తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని అత్యున్నత శిఖరాలకు చేర్చిన దర్శక దిగ్గజం రాజమౌళి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజమౌళి… ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా తారక్, రామ్ చరణ్ లతో కలసి తన 13వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1973 అక్టోబర్ 10న రాజమౌళి జన్మించారు. సినిమా రంగంలోకి అడుగు పెట్టకముందు ఆయన టీవీ సీరియళ్లకు పని చేశారు.