భారత్‌తో మైత్రి కొనసాగుతుంది ………..

0
5
భారత్‌తో మైత్రి కొనసాగుతుంది ………..

ఢిల్లీ :(టిన్యూస్10):న్యూస్‌టుడే 

  • ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం
  •  భారత రాయబారి అలీ చెగేనీ మంగళవారం ఓ ప్రకటన
  •  అందరికీ ఆమోదయోగ్యం’ 

                        వివరాల్లోకి వెళితే…..ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావానికి లోను కాకుండా.. భారత్‌ తన దేశ ప్రయోజనాల మేరకే నడుచుకొంటుందని భావిస్తున్నామని ఇరాన్ అభిప్రాయపడింది. అలాగే భారత్‌కు చమురు ఎగుమతి విషయంలో ఇరాన్ అండగా ఉంటుందని ప్రకటించింది.   అలాగే చమురు వాణిజ్యానికి వస్తు, రూపాయి మారకాన్ని త్వరలో అనుమతించే అవకాశమూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో భారత్‌ చమురు భద్రతకు అమెరికా కృషి చేస్తోందని ఇటీవలి పర్యటన సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇరాన్‌ నుంచి ఈ ప్రతిపాదన రావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఇటీవల పాంపియోతో భేటీ సందర్భంగా విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించిన అభిప్రాయాన్ని అలీ ఉటంకించారు. ‘‘భారత్‌, ఇరాన్‌ చిరకాల మిత్రులు. జయశంకర్ ప్రకటించినట్లుగా.. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్‌ ఎప్పుడూ తమ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నాం.