భారత్ తో కివీస్ కి T20 ….

0
8
భారత్ తో కివీస్  కి  T20 ….

వెల్లింగ్టన్‌ న్యూస్ టుడే: అటు పురుషుల జట్టుతో పాటు, మహిళల జట్టు కూడా నేడు టీ20 సిరీస్‌ ఆతిథ్య జట్టుతో ప్రారంభిస్తోంది. మూడు వన్డే మ్యాచుల సిరీస్‌లో చివరి వన్డేలో మిథాలీ సేన ఓటమి పొందినప్పటికి తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. వన్డేల్లో అంతగా ప్రతిభ చూపని టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేటినుంచి ప్రారంభం కానున్న పొట్టి ఫార్మాట్లో తన సత్తాను చాటడానికి సిద్ధమని తెలిపింది. వెస్టిండీస్‌లో జరిగిన వరల్డ్‌ టీ20 టోర్నీలో ఇంగ్లండ్‌ చేతిలో సెమీఫైనల్లో ఓటమి తర్వాత భారత్‌ ఆడుతున్న తొలి టీ20 సిరీస్‌ ఇది. సెమీ ఫైనల్లో మిథాలీ రాజ్‌ను తప్పించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కోచ్‌ రమేష్‌ పొవార్‌ స్థానంలో డబ్ల్యువి రామన్‌ను నియమించారు. భారత్‌ బ్యాట్స్‌వుమెన్‌ ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో కివీస్‌ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. ఈ ఏరియాలో భారత్‌ మెరుగుపడాల్సి ఉంది. వేదా కృష్ణమూర్తి స్థానంలో ఆల్‌ రౌండర్‌ ప్రియా పూనియా జట్టులోకి వచ్చింది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లు ఈ పర్యటనలో భాగా రాణిస్తున్నారు. వారుఅందిస్తున్న ప్రారంభాన్ని మిగతా ఆటగాళ్లు అందుకోవాల్సి ఉంది. హర్మన్‌, మిథాలీలలతో పాటు బౌలింగ్‌లో కూడా భారత జట్టు రాణిస్తే.. మరో సిరీస్‌ విజయం భారత్‌ ఖాతాలో పడటం ఖాయమని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here