బీజేపి ప్రజాచైతన్య యాత్ర

0
6
బీజేపి ప్రజాచైతన్య యాత్ర

ఆదోని న్యూస్ టూడే:పట్టణంలో హన్సాజీ పేట, ఎల్బీ, విక్టోరియా పేట, చౌకి మఠం ప్రాంతాలలో శనివారం బీజేపి ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది. యాత్రలో బీజేపి రాష్ట్ర కార్యదర్శి నీలకంఠ పాల్గొని ప్ర్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు. ముఖ్యంగా రైతులకు ఏటా రూ. 6 వేలు పెట్టుబడి సాయం, రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయానికి పన్ను మినహాయింపు వంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉందన్నారు. జీఎస్టీ విధానంతో పన్ను ఎగవేతదారుల జాబితా పూర్తిగా తగ్గిపోయిందన్నారు. అనంతరం ఆయా వార్డులలో బీజేపి జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపి పట్టణ కార్యదర్శి నాగరాజు, విజయ్‌, జిల్లా నాయకులు రఘు, రవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here