బిగ్‌బాస్ హౌస్‌లో పునర్నవి వీరంగం.. వెధవ అంటూ రవిపై రెచ్చిపోయిన వైనం!

0
4
బిగ్‌బాస్ హౌస్‌లో పునర్నవి వీరంగం.. వెధవ అంటూ రవిపై రెచ్చిపోయిన వైనం!

న్యూస్‌టుడె:ముఖ్యంశాలు….

  • నామినేషన్‌పై చర్చ సందర్భంగా రెచ్చిపోయిన పునర్నవి 
  • వాడు, వీడు అంటూ నోటికి పని
  • సొల్లు కబుర్లు చెప్పే ఆ వెధవతో మాట్లాడనన్న పునర్నవి

స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ హౌస్‌ సోమవారం ఒక్కసారిగా వేడెక్కింది. ఫైనల్‌ వరకు ఎవరు, ఎందుకు ఉండాలి.. అందుకు అర్హత ఏంటో చెప్పాలన్న బిగ్‌బాస్ ప్రశ్నతో హౌస్‌లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. బిగ్‌బాస్ ఆదేశంతో  హౌ‌స్‌లో చర్చ మొదలైంది.ఈ క్రమంలో బాబా భాస్కర్-వరుణ్ సందేశ్ మధ్య చర్చ మొదలైంది. ఈ సందర్భంగా బాబా భాస్కర్ మాట్లాడుతూ.. పునర్నవి హౌస్‌లో ఉంటే తనకు ప్రాబ్లం లేదని అయితే, తనకు భాష రాదని విమర్శించడం సరికాదని అన్నాడు. ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నప్పుడు కల్పించుకోవాలని తనకు అనిపించలేదని, అందుకే వివరణ ఇవ్వలేదని పేర్కొన్నాడు.ఆ తర్వాత పునర్నవి-రాహుల్ మధ్య కూడా నామినేషన్‌పై చర్చ మొదలైంది. ఈ చర్చలోకి వరుణ్ సందేశ్, వితికలు ఎంటరవడంతో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో రవి తనపై చేసిన ఆరోపణలపై వితిక అంతెత్తున లేచింది. దీంతో ‘నువ్వు రవితో మాట్లాడావా?’ అని పునర్నవిని హౌస్ మేట్స్ అడిగారు. దీనికి తాను లేదని సమాధానం ఇస్తూ చెలరేగిపోయింది. వాడు, వీడు అంటూ రెచ్చిపోయింది.‘రవి గాడు వెధవ, ఆ వెధవతో నేనెందుకు మాట్లాడాలి.. వాడి సొల్లు డిస్కషన్ ఎందుకు దండగ’ అంటూ నోటికి పనిచెప్పింది.