138 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకున్న ‘బిజిల్’…….

0
3
138 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకున్న ‘బిజిల్’…….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘బిజిల్’
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు 
  • తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే 3 కోట్లు రాబట్టే ఛాన్స్

తమిళనాట విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ కి తగినట్టుగానే అయన తాజా చిత్రమైన ‘బిజిల్’ భారీస్థాయిలో విడుదలవుతోంది. ఇంతవరకూ చేయని పాత్రల్లో విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడంతో, అందుకు తగినట్టుగానే బిజినెస్ జరుపుకుంది.ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 83.55 కోట్ల బిజినెస్ జరుపుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మేర బిజినెస్ అయింది. ఇతర రాష్ట్రాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా 108 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 138.55 కోట్ల బిజినెస్ జరిగిందనేది ట్రేడ్ వర్గాల మాట. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే ఈ సినిమా 3 కోట్ల వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నారు. అభిమానులు ఆశిస్తున్నట్టుగా, ఈ సినిమాతో విజయ్ కొత్త రికార్డులు సృష్టిస్తాడేమో చూడాలి.