పార్లమెంటరీ స్థాయీ సంఘా చైర్మన్‌లుగా బీజేపీ నేతలు వీరే…

0
11
పార్లమెంటరీ స్థాయీ సంఘా చైర్మన్‌లుగా బీజేపీ నేతలు వీరే…

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురికి పదవులు
  • అన్ని శాఖలకు చైర్మన్లను ప్రకటించిన లోక్‌సభ స్పీకర్‌
  • హోం వ్యవహారా శాఖ బాధ్యత కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మకు

                                       వివరాల్లోకి వెళితే…పార్లమెంటరీ స్థాయీ సంఘాలను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించిన చైర్మన్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి చోటు దక్కింది. బీజేపీ ఎంపీ టి.జి.వెంకటేష్‌కు రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ, టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావుకు పరిశ్రమ శాఖ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వాణిజ్య వ్యవహారాల శాఖ స్థాయీ సంఘాల చైర్మన్‌లుగా నియమిమంచినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. అలాగే ఆయా సంఘాల్లో నియమితులైన సభ్యుల వివరాలను ప్రకటించింది. కీలకమైన హోం వ్యవహారాల స్థాయీ సంఘం చైర్మన్‌గా కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ నియమితులయ్యారు. గతంలో చిదంబరం ఈ విభాగం చైర్మన్‌గా వ్యవహరించారు. ఇంకా పెట్రోలియం శాఖకు బీజేపీ ఎంపీ రమేష్‌ బిధురి, ఐటీ శాఖకు కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌, రక్షణశాఖకు బీజేపీ నేత జోయల్‌ ఓరం, విదేశీ వ్యవహారాల శాఖకు బీజేపీ నేత పి.పి.చౌదరి, రైల్వే శాఖకు రాధామోహన్‌సింగ్‌, ఎరువు, రసాయనాల శాఖ స్థాయీ సంఘం చైర్మన్‌లుగా డీఎంకే ఎంపీ కనిమొళిని నియమించారు. కాగా, విదేశీ వ్యవహారాల స్థాయీ సంఘంలో చిదరంబరం, ఎరువులు, రసాయనాల స్థాయి సంఘంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, అభిషేక్‌మను సింఘ్వి సభ్యులుగా ఉన్నారు.